Iran : రహస్య బంకర్ లోకి ఇరాన్ సుప్రీం.. గుణపాఠం చెబుతామన్న ఖమేనీ

Iran : రహస్య బంకర్ లోకి ఇరాన్ సుప్రీం.. గుణపాఠం చెబుతామన్న ఖమేనీ
X

ఎటువంటి సంకేతాలకు కూడా చిక్కని రహస్య స్థావరానికి ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేనీ వెళ్లిపోయారు. గత మార్చిలోనే అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలను గమనించి యురేనియంను సురక్షిత ప్రదేశానికి తరలించేశామని ప్రకటించారు. శాటిలైట్ ఫొటోలు కూడా ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. మరోవైపు.. అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ దాడులతో దెబ్బతిని ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. మొత్తం 30 క్షిపణులను ప్రయోగించింది. టెల్ అవీన్ సైరన్ల మోతతో మార్మోగింది. భారీఎత్తున ఆస్తినష్టం సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి. ట్రంప్.. నీకు చరిత్ర మరచిపోని విధంగా గుణపాఠం చెబుతాం.. సిద్ధంగా ఉండమని ఖమేనీ తీవ్రంగా హెచ్చరించారు. మిత్ర దేశమైన రష్యా అధినేత పుతిన్ తో నిరంతరం టచ్ లో ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. హుటాహుటిన రష్యాకు బయలుదేరి వెళ్లారు.

Tags

Next Story