Iran vs Israel–US War Escalates : యుద్ధం ఆగకుంటే ఇండియాకు నష్టమేనా..?

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం భీకర రూపాన్ని సంతరించుకుంటోంది. రోజురోజుకూ పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాంబుల మోతతో అట్టుడికిపోతోంది ఆ ప్రాంతమంతా. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. అలాగే గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దుబాయ్, సౌదీ, కువైట్, బహ్రెయిన్, యెమన్, ఒమన్ దేశాల్లోని క్రూడ్ ఆయిల్ కేంద్రాలను తీవ్రంగా ధ్వంసం చేసింది ఇరాన్. సౌదీలోని అతిపెద్ద ఆయిల్ కేంద్రం ఆరాంకోను పేల్చేసింది ఇరాన్. మన దేశంతో పాటు ప్రపంచం మొత్తానికి ఈ గల్ప్ దేశాల నుంచే చమురు ఎగుమతి అవుతుంది. ఇండియాకు ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాల నుంచే 50 శాతం చమురు దిగుమతి అవుతోంది.
అలాగే రష్యా, వెనెజువెలా నుంచి కొంత వరకు వస్తోంది. కానీ ఇప్పుడు ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాల నుంచి చమురు రావడం ఆగిపోయింది. మన దేశం దగ్గర 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయని కేంద్రం చెప్పింది. ఇప్పటికే నాలుగు రోజులు అయిపోయింది. ఇంకో 20 రోజుల తర్వాత చమురు ధరలు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. అదే జరిగితే ఇండియాలో చమురు చుట్టూ ఆధారపడ్డ అనేక బిజినెస్ లు దెబ్బ తింటాయి.
దాని వల్ల నిత్యవసర సరుకుల ధరలతో పాటు ట్రాన్స్ పోర్టు ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది ఓవరాల్ గా ఇండియన్ ఎకానమీపై ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఇరాన్ మరిన్ని దేశాలపై దాడులను కంటిన్యూ చేస్తోంది. అటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా భీకర దాడులను కొనసాగిస్తున్నాయి. రోజురోజుకూ సరికొత్త వెపన్స్ తో దాడులు చేసుకుంటున్నాయి ఆ దేశాలు. దీంతో యుద్ధం మరింత ముదురుతోంది తప్ప తగ్గట్లేదు. ఇలాగే కొనసాగితే ఇండియాకు నష్టమే అంటున్నారు నిపుణులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
