Iran vs US–Israel War Escalates : ఇరాన్ సంచలన ప్రకటన.. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు..

ఇరాన్ వర్సెస్ అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం అత్యంత భయానకంగా మారుతోంది. ఇప్పటికే తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని ఇప్పుడు పదో రోజులోకి అడుగు పెట్టింది ఈ యుద్ధం. అయితే యుద్ధ వాతావరణం సమయంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఖమేనీని చంపినందుకు ట్రంప్ రక్తం చూస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ గా కొత్త నాయకుడిని ఎంచుకున్నట్టు కూడా ఇరాన్ తెలిపింది. కానీ ఎవరిని ఎన్నుకున్నారనేది తెలపలేదు. అటు ఇజ్రాయెల్ ఈ విషయంపై వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ కొత్త లీడర్ ఎవరైనా.. అతన్ని కూడా చంపేస్తామని తెలిపింది. కొత్త లీడర్ ఎవరైనా చావుకు సిద్ధపడి బాధ్యతలు తీసుకోవాలంటూ తెలిపింది. ట్రంప్ కూడా సీరియస్ అయ్యారు. ఇరాన్ మీద మరింత భీకరంగా దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.
దీంతో మూడు దేశాలు అస్సలు తగ్గట్లేదని అర్థమైపోయింది. ఈ వార్నింగులు చూస్తుంటే.. యుద్ధం మరింత భయానకంగా మారడం ఖాయం అంటున్నారు అంతర్జాయతీ స్థాయి విశ్లేషకులు. ఇప్పటికే గల్ఫ్ దేశాల ఆయిర్ రిఫైనరీలపై ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. ఇరాన్ ఆయిల్ కంపెనీలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. యుద్ధం ఇప్పుడు ఆర్థిక మూలాలను దెబ్బ తీయడం వైపు సాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ లెక్కన ఆయిల్ కంపెనీలు తీవ్రంగా దెబ్బ తినడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు. అదే జరిగితే.. ప్రపంచ దేశాలకు ఆయిల్ సంక్షోభం తప్పేలా లేదు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది. యుద్ధం ఇప్పట్లో శాంతించే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి.. ఇది ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందనేది చూడాలి.
Tags
- Iran US Israel war
- Iran Israel conflict
- Donald Trump warning Iran
- Khamenei death Iran
- Iran new supreme leader
- Middle East war escalation
- Iran oil refinery attacks
- Israel strikes Iran oil facilities
- global oil crisis fears
- Gulf oil refinery attacks
- Iran retaliation threat
- Middle East geopolitical tensions
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
