Iran–Israel War Escalates : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో భయానకం..!

Iran–Israel War Escalates : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో భయానకం..!
X

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భయానకంగా మారుతోంది. అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలపై, ఇజ్రాయెల్ మీద ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. దాన్ని ట్రంప్, నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకంచారు. ప్రతీకార చర్యలు ఆపకపోతే మరింత గట్టిగా దాడులు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా బీ2 బాంబులు ప్రయోగిస్తోంది. దీంతో ఇరాన్ చాలా నష్టపోతోంది. ఇలా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో పశ్చిమ ఆసియా అట్టుడికిపోతోంది. గల్ఫ్‌ దేశాలపై ఒమెన్, బహ్రెయిన్, దుబాయ్, సౌదీ, కువైట్ మీద ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమ ఆసియా మొత్తం అట్టుడికిపోతోంది. భీకరమైన దాడులతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఎయిర్ పోర్టులు మొత్తం క్లోజ్ అయ్యాయి. రాకపోకలు ఆగిపోయాయి.

క్రూడ్ ఆయిల్ ఎగుమతులు ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయాయి. ఇరాన్ దెబ్బతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. పశ్చిమ ఆసియా మొత్తం ఇప్పుడు రణరంగంగా మారిపోయింది. డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ తన చుట్టూ ఉన్న గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై భీకరంగా దాడులు చేస్తోంది. అటు అమెరికా కూడా భయంకరమైన దాడులకు దిగుతోంది. ఈ యుద్ధం ఇంకా కొన్ని వారాల పాటు కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించారు.

అమెరికాతో చర్చలకు సిద్ధమని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. తాను కూడా చర్చలకు రెడీగా ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో అతి త్వరలోనే ఈ యుద్ధాలకు ముగింపు పలకాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. కానీ తమ శత్రు స్థావరాలను మాత్రం భూస్థాపితం చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికీ బలంగా దాడులు జరుగుతున్నాయి. మరి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఇప్పుడు అందరి చూపు ట్రంప్ చర్యలపైనే ఉంది.

Tags

Next Story