Barack Obama : ఏంటీ నిజమా... విడాకులకు సిద్ధమైన బరాక్ ఒబామా దంపతులు!

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా విడిపోతున్నారని అక్కడి సోషల్ మీడియా కోడై కూస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మిషెల్ రావడం లేదని, బరాక్ మాత్రమే వస్తారని వారి ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకూ ఆమె హాజరుకాలేదు. భర్తతో కలిసి పబ్లిక్ ఈవెంట్స్‌కు రాకపోవడంతో వారిద్దరు విడాకులు తీసుకుంటున్నారని వదంతులు వ్యాపించాయి. ఒబామాకు, మిచెల్ కు.. 1992 లో పెళ్లి జరిగింది. వీరిని మోస్ట్ పవర్ ఫుల్ కపుల్ గా భావిస్తుండే వారు. బారక్ ఒబామా ఎక్కడికి వెళ్లిన కూడా మిచెల్ ఆయన్ను వెన్నంటే ఉండేది. ఇక వీరికి ఇద్దరు కూతుళ్లు. వారు.. సాషా, మలియా. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా 2009 లో బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో నల్లజాతీయుడికి దక్కిన అరుదైన గౌరవంగా అందరు భావించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఒక్కసారిగా వీరిద్దరు డైవర్స్ తీసుకుంటున్నారనే వార్త తీవ్ర దుమారంగా మారాయి . బరాక్ ఒబామా అమెరికాకు 44వ అధ్యక్షుడు. అమెరికా ఖండం బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. అధ్యక్షుని పదవి చేపట్టిన తొమ్మిది నెలల తరువాత 2009 నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పెళ్లాయ్యక తమ మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఎదురయ్యాయని వాటిని ఎదురుకునేందుకు కౌన్సెలింగ్ తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com