Donald Trump : బ్రేకుల్లేని ట్రంప్... హ్యాట్రిక్ విజయం

Donald Trump : బ్రేకుల్లేని ట్రంప్... హ్యాట్రిక్ విజయం

మరికొద్ది నెలల్లోనే అమెరికాలో (America) అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) రానున్నారా... ఏమో ఆయన స్పీడు చూస్తే అదే నిజమనిపిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ చాలా ముందున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో ట్రంప్ గెలుపు బావుటా ఎగురవేశారు. తాజాగా మూడో గెలుపు సాధించారు.

ఫిబ్రవరి 8న గురువారం రోజున వర్జిన్​ ఐలాండ్స్ ​లో అభ్యర్థిత్వ ఎన్నిక జరిగింది. ఈ మూడో ఎలక్షన్​ లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. డొనాల్డ్ ట్రంప్​ 73 శాతం ఓట్లు సాధించి భారీ మెజార్టీ సాధించారు. అపోజిట్ క్యాండిడేట్, డెమక్రాటిక్ అభ్యర్థి నిక్కి హేలీకి 26 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

తాజా విజయం, ట్రెండ్స్ పై ట్రంప్ శిబిరం హ్యాపీగా ఉంది. ఈ గెలుపు ఎక్స్ పెక్ట్ చేసిందేననీ.. ఇంత భారీ మెజారిటీ మాత్రం ఊహించలేదని ట్రంప్ తెలిపారు. అమెరికాకు మరోసారి సేవ చేసే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఐతే.. వర్జినియా ఎన్నికల్లో అధికారులు ఎలక్షన్ రూల్స్ పాటించలేదని విమర్శలు వినిపించాయి. అనుమతించిన టైం కంటే ముందే ఎలక్షన్ నిర్వహించారని డెమొక్రాట్ పార్టీ విమర్శించింది. రానున్న రోజుల్లో నిక్కీ హేలీ రాత మారుతుందని, ట్రంప్ జోరు తగ్గుతుందని.. ఆ పార్టీ కేడర్ ఆశావహంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story