Pakistan : పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా ఐఎస్ఐ చీఫ్

Pakistan : పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా ఐఎస్ఐ చీఫ్
X

పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ను జాతీయ భద్రతా సలహా దారుగా నియమిస్తూ పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు నిర్వహి స్తారు. గత ఏడాది సెప్టెంబర్లో ఆయన్ను పాక్ ప్రభుత్వం ఐఎస్ఐ చీఫ్ నియ మించింది. ఆయన సైన్యంలో అడ్జుటంట్ జనరల్ గా పని చేస్తున్నప్పుడే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, ఆయన మద్ద తుదారుల ఆందోళనలపై ఆర్మీ ఆణిచివేత వంటి ఘటనలు జరిగాయి. బలోచిస్తాన్ , దక్షిణ వజీరిస్తాన్లో ఆర్మీ డివిజన్లకు నా యకత్వం వహించిన మాలిక్... ఎలాంటి సవాళ్లనైనా కఠినంగా ఎదుర్కొంటారనే పేరుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, భారత్ ఏ క్షణమై నా దాడులు చేయొచ్చని భయం వెంటాడు తున్న వేళ పాక్ ప్రస్తుతం ఆయనకు పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు భాద్యతలు అప్పగించింది.

Tags

Next Story