Israel Attack : ఏడాదికిందటే బంకర్ లో భార్యతో సిన్వర్.. ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందారు. అయితే మట్టుబెట్టేందుకు కొద్ది సేపటి ముందు గడిపిన వీడియోను Israeli armyIsraeli army విడుదల చేసింది. ఓ బంకర్‌లో సిన్వర్, అతడి భార్య వెళ్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. గతేడాది అక్టోబరు 7నాటి దాడులకు కొన్ని గంటల ముందు కూడా సిన్వర్ ఈ సొరంగంలోకి వెళ్లి దాక్కున్నట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి.
సిన్వర్, అతడి భార్య, పిల్లలు కలిసి పలు వస్తువులను పట్టుకుని సొరంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇది అతడి ఇంటి కింద ఏర్పాటు చేసుకున్న సొరంగం అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డానియల్ హగేరీ పేర్కొన్నారు. గత ఏడాది తమపై దాడులు చేసినప్పటి నుంచి సిన్వర్ ఈ సొరంగంలోనే ఎక్కువ సమయం గడిపినట్లు వెల్లడించారు.
గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపుదాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. ఆ ఘటనలో 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. దీంతో ఈ దాడులకు సూత్రధారి అయిన సిన్వర్‌ను హతమర్చాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిన్వర్ మృతి చెందాడు. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతి చెందింది హమాస్ అధినేతేనని ఇజ్రాయెల్ నిర్ధారించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com