Israel-Hamas War : ఇజ్రాయెల్-హమాస్ వార్.. 40 వేల మంది మృతి

రెండు దేశాల మధ్య సంగ్రామంలో పిట్టల్లా రాలిపోయే ప్రాణాలకు లెక్కే ఉండదు. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. 92,401 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 85 శాతం మంది తమ ఇళ్లను విడిచి వెళ్లిపోయారు.
అక్టోబర్ 7 న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో సుమారు 1200 మంది చనిపోయారు. తమ వద్ద ఇంకా 111 మంది బందీలుగా ఉన్నారని అందులో మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది. యుద్ధం గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని నెలకొల్పింది. ఆకలి పరిస్థితి మరింత దిగజారుతోంది.
ఒక నివేదిక ప్రకారం, రాబోయే కొద్ది నెలల్లో 4,95,000 మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆకలి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com