Israel : ఆగని ఇజ్రాయెల్.. వెయ్యి రాకెట్లతో హెజ్బొల్లాలే లక్ష్యంగా విధ్వంసం

Israel : ఆగని ఇజ్రాయెల్.. వెయ్యి రాకెట్లతో హెజ్బొల్లాలే లక్ష్యంగా విధ్వంసం
X

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకు న్నాయి. హెజొల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రా యెల్ దళాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని హెజ్ బొల్లా స్థావరా లపై ఐడీఎఫ్ వైమానిక దాడులకు దిగింది. దాదాపు వంద రాకెట్ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను, యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

ఈ రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసేందుకు సిద్ధం చేయగా.. వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. హెజ్ బొల్లా సభ్యులకు చెందిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఈ సంస్థ అధిపతి హసన్ నస్రల్లా ప్రసంగించారు. ఆ సమయంలోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది.

Tags

Next Story