Iran-Israel War: ఇరాన్ పై కొనసాగుతున్న బాంబుల వర్షం

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ తాజాగా భారీ స్థాయిలో దాడులకు దిగింది. టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. సుమారు 20 ఫైటర్ జెట్లతో ఈ దాడిలో 30కి పైగా బాంబులను ప్రయోగించినట్లు టెల్ అవీవ్ రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ దాడులు తమ భూభాగాన్ని టార్గెట్ గా చేసుకుని నిల్వ చేసిన క్షిపణులు ఉన్న స్థావరాలపై జరిగాయని తెలిపింది. ఇది తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
అయితే, టెహ్రాన్‌లోని కీలక మిస్సైల్ లాంచర్ స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, కెర్మాన్షా, హమెదాన్ ప్రాంతాల్లోని మిలిటరీ రాడార్ కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ మిస్సైల్ కేంద్రాలు భవిష్యత్తులో తమ దేశాన్ని లక్ష్యంగా చేయడానికే ఉపయోగపడతాయని పేర్కొనింది. గత కొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులను మితిమీరిన చర్యగా అంతర్జాతీయ సమాజం విమర్శలు గుప్పిస్తుంది. మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పాలని, యుద్ధాన్ని ఆపేయాలని ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు ఇజ్రాయెల్- ఇరాన్ ను కోరుతున్నాయి. ఇక, ఇరాన్ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ప్రతీకార దాడులకు దిగలేదు. తాజా దాడులతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com