Israeel : మిషన్ ఇరాన్.. యుద్ధ వ్యూహం రెడీ చేసిన ఇజ్రాయెల్

Israeel : మిషన్ ఇరాన్.. యుద్ధ వ్యూహం రెడీ చేసిన ఇజ్రాయెల్
X

ఇరాన్‌పై ప్రతి దాడులకు ఇజ్రాయేల్‌ రెడీఅవుతోంది. ఇందుకు తమ మిత్ర దేశమైన అమెరికా మద్దతు కోరింది. అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై పరిమిత స్థాయిలోనే దాడికి తాము అంగీకరించామని తెలిపారు. అయితే ఇరాన్‌ క్షిపణుల దాడులకు ఏ స్థాయిలో స్పందించాలన్న అంశంపై అమెరికా, ఇజ్రాయేల్‌‌లు తీవ్రంగా చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేస్తామంటూ బెంజమిన్‌ నెతన్యాహు చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తిరస్కరించారని తెలుస్తోంది. దీనికి తమ మద్దతు ఉండదని, పరిమిత స్థాయిలోనే దాడి చేయాలని షరతు విధించారు.చినట్లు సమాచారం.

ఇరాన్‌లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా స్వల్ప దాడులు జరగొచ్చన్న ఆయన.. దీనిపై చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నెల రోజులే ఉండగా.. ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ క్షిపణి దాడికి ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకుంటుందని తాను భావించడం లేదని, అణుక్షేత్రాలపై దాడులకు తాము అంగీకరించబోమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన కొద్ది సేటికే పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళనలతో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఐదు శాతం మేర పెరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ చమురు ధరలు పెరగడం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హ్యారిస్‌కు కొంత ఇబ్బందికరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జీవన వ్యయం ప్రధాన అంశంగా కావడంతో హ్యారిస్‌కు భారీ నష్టాన్ని కలిగించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

Next Story