JD Vance : త్వరలో భారత పర్యటనకు జేడీ వాన్స్

తెలుగింటి అల్లుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ త్వరలోనే భారత్ కు రానున్నారు. భార్య ఉష చిలుకూరితో కలిసి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఇండియాకు వస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఉపాధ్యక్ష బాధ్యతలు అందుకున్న తర్వాత వాన్స్ చేపడుతున్న రెండో విదేశీ పర్యటన ఇదే కానుంది. గత నెల ఆయన ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు వెళ్లారు. తెలుగు మూలాలున్న ఉష సెకండ్ లేడీ హోదాలో ఇక్కడికి రానుండటం ఇదే తొలిసారి. ఉష చిలుకూరి పూర్వికులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980ల్లోనే అమెరికా వలసవెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టి పెరిగారు. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యా చిలర్ డిగ్రీ పొందారు. యేల్ లో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారి.. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. వీరికి ముగ్గురు సంతానం. రాజకీయాల్లో వాన్స్‌కు ఉష అడుగడుగునా అండగా నిలబడ్డారు. గతేడాది ఎన్నికల సమయంలోనూ వాన్స్ తరఫున చురుగ్గా ప్రచారం చేసి ఆమె మీడియా దృష్టిని ఆకర్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com