Pakistan Army : జీహాద్ మా విధానం : పాకిస్తాన్ ఆర్మీ

పాకిస్తాన్ ఆర్మీ మరోసారి తమ బుద్ధిని బయట పెట్టుకుంది. జీహాదే తమ విధానమని స్పష్టం చేసింది. అంతే కాదు ఆర్మీ చీఫ్ జీహాదీ జనరల్ అని వెల్లడించింది. మీడియా సమావేశంలో ఆర్మీ అధికారులు ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. జనరల్ జియా ఉల్ హక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తమ అధికా రిక నినాదంలో మార్పు వచ్చినట్లు చెప్పారు. మా ర్గదర్శక సూత్రాలైన ఇత్తెహాద్ (ఐక్యత), యాకీస్ (విశ్వాసం), తంజీమ్ (క్రమశిక్షణ) ల స్థానంలో ఇమాన్ (విశ్వాసం), తక్వా (దైవభక్తి), జీహాద్ ఫి-సబిలిల్లా (దేవుడి పేరు మీద పోరాటం)లను చేర్చినట్లు తెలిపారు. ఇమాన్, తఖ్వా, జీహాద్ ఫిసబిలిల్లా, అంటే విశ్వాసం, భక్తి, దేవుని పేరు మీద పోరాటం అని అర్ధం, అని ఆయన అన్నారు. ఒకవైపు కాల్పుల విరమణ కు సిద్దమంటూ ప్రతిపాదన చేసిన పాకిస్తాన్ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఉల్లంఘ నకు పాల్పడింది. తాజాగా ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఆపరేషన్ డీజీల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న రోజునే అక్కడి ఆర్మీ అధికారులు మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com