Former US President : జో బైడెన్ కు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. క్యాన్సర్ కణాలు ఇప్పుడు ఆయన ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం వైద్యులు బైడెన్ కు ఏయే చికిత్సలు అందించాలో పరిశీలిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది. ఈ కారణంగా చికిత్స చేయడం సాధ్యపడుతుందని వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, కొన్ని సందర్భాల్లో ఎముకలను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయడం ప్రభావవంతంగా ఉంటుందంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com