Pak Security : జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు గన్ మెన్లు

మన దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశారన్న ఆరోపణలపై అరెస్టైన హర్యానాకు చెందిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు దాయాది దేశంలో వీఐపీ ట్రీట్మెంట్ లభించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాక్ లో ఆమెకు దాయాది దేశం ఆరుగురు గన్మెన్లను ఏర్పాటు చేసింది. ఏకే 47 రైఫిల్స్తో ఆమెకు రక్షణ కల్పించారు. స్కాంట్లాండ్కు చెందిన యూ ట్యూబర్ కల్లమ్ మిల్ తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెల్లడైంది. జ్యోతి మల్హోత్రా పాక్ ను సందర్శించిన సమయంలో అదే దేశంలో పర్యటిస్తున్న స్కాంట్లాండ్ యూ ట్యూబర్ను ఆమెను లోహోర్ లోని అనార్కలి బజార్ లో కలిశాడు. ఆ ప్రాంతంలో వీడియోలు చిత్రీకరిస్తున్న జ్యోతికి అంతమంది గన్మెన్లు రక్షణగా ఉండటం చూసి షాకయ్యాడు. ఆమెతో తనను తాను పరిచయం చేసుకొన్నాడు. పాక్కు మొదటిసారి వచ్చారా అని జ్యోతి అడగ్గా.... లేదు ఐదు సార్లు వచ్చానని బదులిచ్చాడు. తాను ఇండియన్ అని చెప్పిన జ్యోతి అక్కడ తనకు దగ్గిన సెక్యూరిటీ పట్ల గొప్పగా ఫీలవుతున్నట్లు అతడితో చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com