Donald Trump : బిలియనీర్లపై ట్రంప్ ఆధారపడుతున్నారు: కమలా హారిస్

డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నామినేటైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ( Kamala Harris ) తన తొలి ప్రచారసభలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ ( Donald Trump ) బిలియనీర్లపై ఆధారపడుతున్నారని, వారితో బేరసారాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. తన ప్రచారానికి విరాళాలు ఇచ్చిన వారికి చమురు కంపెనీలు ఇస్తానని ఆయన హామీ ఇస్తున్నట్లు ఆరోపించారు. తాము ప్రజాశక్తితో పనిచేస్తున్నామని, ప్రజా ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఆమెకు అన్నివైపుల నుంచి మద్దతు వెల్లువెత్తింది. పార్టీలో ఆమెకు పోటీగా నిలుస్తారనుకున్న వారినుంచి.. చట్టసభల సభ్యులు, గవర్నర్లు, ప్రభావిత వర్గాలవారు హారిస్ వైపే మొగ్గు చూపారు. అధ్యక్ష అభ్యర్థిగా నిలవాలంటే కావాల్సిన ప్రతినిధుల ఓట్ల కంటే అధికంగా ఆమె సాధించినట్లు మీడియా సంస్థలు మంగళవారం పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com