Kamareddy Student : బర్త్ డే నాడే ఫిలిప్పిన్స్ లో కామారెడ్డి విద్యార్ధి మృతి

చదువు, బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి అసువులుబాసుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు తన బర్త్ డే నాడే మరణిచాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన మెడికల్ స్టూడెంట్ ఫిలిప్పీన్స్‌లో గుండెపోటుతో చనిపోయాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఇంట్లో చావు వార్త తీవ్ర దుఃఖాన్ని నింపింది. కొడుకు మరణంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.
కామారెడ్డి జిల్లా కుర్లెం గ్రామానికి చెందిన యోగి(23) మూడేళ్ల క్రితం వైద్య విద్య చదవడానికి ఫిలిప్పీన్స్‌కు వెళ్లాడు. కాలేజీకి హాలిడేస్ రావడంతో మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన యోగి, 15 రోజుల క్రితం తిరిగి ఫిలిప్పీన్స్ వెళ్లాడు. బుధవారం యోగి 23వ పుట్టినరోజు కాగా.. కుటుంబసభ్యులు అతడికి ఫోన్ లో విషెస్ తెలిపారు.ఆ తర్వాత కాసేపటికే యోగి తన తండ్రికి ఫోన్ చేసి, ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తోందని చెప్పాడు. తన ఫ్రెండ్స్ సాయంతో ఆసుపత్రికి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో యోగిని టెస్ట్ చేసిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కడుకు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com