ఆ కుటుంబంలో ముగ్గురూ సర్పంచ్‌లే..!

గ్రామా పంచాయితీ ఎన్నికల్లో అప్పుడప్పుడు భలే ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా తంబళ్లపల్లె మండలంలోని మర్రిమాకులపల్లె పంచాయతీలో కూడా ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. మర్రిమాకులపల్లె పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కేతిరెడ్డి కుటుంబ హవా నడుస్తోంది.
మొదటగా కేతిరెడ్డి తిమ్మారెడ్డి ఇక్కడ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అలా ఆయన మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరవాత అయన కుమారుడు వెంకటరమణారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు.. ఇక వెంకటరమణారెడ్డి కోడలు జ్యోతి కూడా గతంలో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
తాజాగా ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి ఆమెను గ్రామస్తుల ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. అయితే అక్కడ వీరే కుటుంబమే కొనసాగడం వెనుక ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజా సమస్యలపై స్పందించడం, పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడమే కారణం.
కుల, మత అనే భేదాలు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేయడంతో ఈ కుటుంబం పైన ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.
Also Read :
మీకు గ్యాస్ సబ్సిడీ ఎంత వస్తోంది? ఏ అకౌంట్‌లో ఎంత పడుతుంది? క్షణాల్లో తెలుసుకోండి!
మీ కష్టం వృధాగా పోదు తాత.. నీ మనవరాలు మీ పేరు నిలబెడుతుంది!
ఏడుగురితో బైక్ పైన... దండం పెట్టిన కానిస్టేబుల్..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com