U.S. Presidential Elections : అమెరికాలో ఫలితం మలుపు తిప్పే రాష్ట్రాలివే

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచానికి ఉత్కంఠ పెంచుతున్నాయి. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో చాలా రాష్ట్రాలు ఎక్కువగా ఒకే పార్టీవైపు మొగ్గుచూపుతాయి. ఇరువురూ గెలిచే అవకాశాలు ఉన్న రాష్ట్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. రెండు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీపడే అవకాశం ఉన్న రాష్ట్రాలను బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లేదా స్వింగ్ స్టేట్స్ అంటారు. సర్వేల సగటు ఆధారంగా చూస్తే... ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత లేదు. హారిస్ పోటీలోకి వచ్చినప్పటి నుంచి ట్రెండ్‌లను గమనిస్తే... రాష్ట్రాల మధ్య కొన్ని తేడాలను హైలైట్ చేయడంలో సర్వే ఉపయోగపడుతుంది. కానీ జాతీయ సర్వేలతో పోల్చితే రాష్ట్రాల సర్వేలు చాలా తక్కువగానే ఉంటాయి. ప్రతి సర్వేలో ఎంతో కొంత మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. అంటే, వాళ్లు ప్రకటించిన నంబర్లు వాస్తవానికి కాస్త అటు ఇటుగా వుంటాయి. ఆగస్టు ప్రారంభం నుంచి చూసుకుంటే అరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ కరోలినాలో కొన్నిసార్లు ఆధిక్యం చేతులు మారింది. అయినప్పటికీ, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఈసారి ఎవరి జాతకం ఏంటి అనేది ప్రపంచ దేశాల్లో అతిపెద్ద చర్చగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com