Khaleda Zia : ఖలీదా జియా విడుదల.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Khaleda Zia : ఖలీదా జియా విడుదల.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
X

జైలులో ఉన్న బంగ్లాదేశ్ దేశ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత ఖలీదా జియాను రిలీజ్ చేయాలని దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్ ఆదేశించారు. జియా ప్రత్యర్థి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు. షాహబుద్దిన్ నేతృత్వంలో జరిగిన మీటింగ్ లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చీఫ్ జియాను రిలీజ్ చేయాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష మీడియా కార్యాలయం తెలిపింది.

ఆర్మీ చీఫ్ జనరల్ వాకేర్ ఉజ్ జమాన్ తో పాటు నేవీ, వాయుసేన చీఫ్ ng కూడా ఆ మీటింగ్ కు హాజరయ్యారు. 78 ఏళ్ల ఖలీదా జియా ఆరోగ్యం క్షీణించింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బేగం ఖలీదా జియా 15 ఆగస్టు 1947న అవిభాజ్య భారత్ లోని పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఆమె భర్త లెఫ్టినెంట్ జనరల్ జియావుల్ రెహమాన్ అత్యంత క్రూరమైన మిలటరీ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 1977-1981 వరకు బం గ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హత్యకు గురవడంతో బేగం రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్నారు.

1991లో బంగ్లాదేశ్ kg తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండేది. అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 1996లో రెండోసారి గెలిచినప్పటికీ, ఎన్నికల్లో ఆక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఎన్నికల్ని బాయ్ కాట్ చేశాయి. దాంతో ఆమె ప్రభుత్వం కేవలం 12 రోజులకే కుప్ప

కూలింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో అవామీలీగ్ గెలిచింది. షేక్ హసీనా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే, జియా బేగం మళ్లీ రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2001 నుంచి 2006 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అవినీతి కేసులో అరెస్టయ్యారు. విదేశీ విరాళాల కేసులో 2018లో ఆమెకు పదిహేడేళ్ల జైలు శిక్ష పడింది. దాంతో ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా మారారు. 78 ఏళ్ల జియా ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Tags

Next Story