Border Roads : సరిహద్దు రోడ్లను పేల్చేసిన కిమ్
![Border Roads : సరిహద్దు రోడ్లను పేల్చేసిన కిమ్ Border Roads : సరిహద్దు రోడ్లను పేల్చేసిన కిమ్](https://www.tv5news.in/h-upload/2024/10/16/1381092-kim.webp)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పొరుగు దేశం దక్షిణ కొరియా విషయంలోనూ తన హెచ్చరికను నిజం చేశాడు. వార్నింగ్ ఇచ్చినట్టుగానే సియోల్ ను కలిసే సరిహద్దు రోడ్లను బాంబులతో పేల్చేయించాడు. దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేసేం దుకు నిర్ణయించామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతు న్నాయని ఉత్తర కొరియా సైన్యం నాలుగు రోజుల క్రితం వెల్లడించింది. ఇందులో భాగంగానే తమ దేశంతో ఉన్న సరిహద్దును దాటే రోడ్ల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి ఆ రోడ్లను సోమవారం పేల్చేయించారు.
ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మంగళవారం వెల్లడించారు. తమ వైపు రహదారులను మాత్రం సైన్యం కాపాడు తున్నట్లు తెలిపారు. కాగా, తమ రాజధాని ప్యాంగాంగ్పైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపిందని ఉత్తర కొరియా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో అనుసంధానం ఉన్న రైలు, రోడ్లను పూర్తి గా కట్ చేసి సరిహద్దు ప్రాంతాలను పటిష్ఠం చేస్తామని గతవారం ఉత్తర కొరియా సైన్యం తెలిపింది. మరోసారి ప్యాంగాంగ్ పైన దక్షిణ కొరియా డ్రోన్లు కని పిస్తే భయంకరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తర కొరియా హెచ్చ రించింది. సరిహద్దుల్లో కాల్పుల కోసం 8 సైనిక యూనిట్లను సిద్ధంగా ఉంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com