South Korea: ప్రియుడిని విడిచి ఉండలేక భారత్ కు
ఉత్తర్ ప్రదేశ్ లో మరో దేశాంతర ప్రేమ వివాహం జరిగింది. దక్షిణ కొరియాకు చెందిన యువతి కిమ్ బోహ్ నీ, షాజహాన్ పుర్ కు యువకుడు సుఖ్జీత్ కోసం సరిహద్దులు దాటి వచ్చింది. సుఖ్జీత్ ను భారత సంప్రదాయాల ప్రకారం వివాహమాడింది. కిమ్ బోహ్ నీ3 నెలల పర్యటక వీసాతో భారత్ లోకి ప్రవేశించింది.
యూపీకి చెందిన సుఖ్‌జీత్ సింగ్ అనే యువకుడు దక్షిణ కొరియాలోని బూసన్ కు ఉద్యోగం కోసం వెళ్లి ఓ కేఫ్ లో పనిచేశాడు. అదే కేఫ్ లో బిల్లింగ్ కౌంటర్లో కిమ్ బోహ్ ని చేరింది. కేఫ్ లో పనిచేసుకుంటున్న వారిద్దరి మధ్య చూపులు కలిశాయి. కొన్నాళ్లకు మనసులూ కలిశాయి. ఇద్దరి మధ్య ప్రేమచిగురించి డేటింగ్ ప్రారంభించారు.
ఈమధ్య సుఖ్‌జీత్ సింగ్ పనికి బ్రేక్ తీసుకుని ఆరు నెలల సెలవుపై సొంత ఇంటికి వచ్చేశాడు. రోజులు నెలలుగా మారేటప్పటికి అతడిని వదిలి ఉండలేకపోయిన కిమ్ బోహ్ నీ.. భారత్ కు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లోని సుఖ్‌జీత్ సింగ్ ఇంటికి వెళ్లింది. కిమ్ ను చూసి సర్‌ప్రైజ్ అయ్యాడు సుఖ్‌జీత్ సింగ్. ప్రేమించిన యువతి ఏకంగా ఇంటికే వచ్చేయడంతో అతడి ఆనందానికి అవధులు లేవు.
వారి ప్రేమను చూసిన కుటుంబీకులు గురుద్వారాకు తీసుకువెళ్లి ఘనంగా పెళ్లి చేసేసారు. భార్యతో కలిసి సౌత్ కొరియాలో ఉండి పోదాం అనుకుంటున్నాడు సుఖ్‌జీత్ సింగ్. అతని తల్లిదండ్రులు కూడా అందుకు పూర్తి అంగీకారం తెలపడంతో ఇక వారి ఆనందానికి అవధులు లేవు. కిమ్ బోహ్ ని పర్యటక వీసా గడువు ముగిసిన తర్వాత ఇద్దరు తిరిగి దక్షిణ కొరియాకు వెళ్తారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com