KTR: ఫ్రాన్స్‌లో కేటీఆర్ ప్రసంగం.. తెలంగాణ పురోగమిస్తుందంటూ..
KTR (tv5news.in)
KTR: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్‌కు చెందిన సంస్థలు ముందుకొస్తే.. వారి కోసం ప్రత్యేక క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఫ్రాన్స్‌లో జరిగిన యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. కొవిడ్ అనంతర కాలంలో ఇండో - ఫ్రాన్స్ సంబంధాలు, భవిష్యత్ కార్యాచణర అంశంపై కేటీఆర్ ప్రసంగించారు.
పారిశ్రామిక ప్రగతిలో.. దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పురోగమిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. భూముల కేటాయింపు, అనుమతులు, శిక్షణ పొందిన మానవ వనరులను అందించడంలో సాయం, వనరుల సేకరణ వంటి అంశాల్లో భారత్‌లో రాష్ట్రాలు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నాయన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com