Nepal :నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీ సింగ్ ?

Nepal :నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీ సింగ్ ?
X

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. జెనెజెడ్ తరపున ఆయన పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనకు అన్ని వర్గాల మద్దతు తెలిపాయి. మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి, ఖాట్మాండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ పేర్లు వినిపించాయి. వీరిలో కర్కి నేపాల్ సుప్రీంకోర్టుకు తొలి మహిళా సీజేగా నిలిచారు. బాలేంద్ర షా బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేసి, యువతలో క్రేజ్ సం పాదించారు. ప్రభుత్వ అవినీతి వ్యతిరేకంగా చెలరేగిన హింస ఇప్పుడు కొంత సద్దుమణిగింది. ఈ నెల 9న జరిగిన ఘర్షణల్లో ప్రాణన ష్టం, ఆస్తినష్టం ఎక్కువవడంతో ప్రధానమం త్రి కేపీ శర్మ ఓలి సహా పలువురు మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే సైన్యం రంగంలోకి దిగి కర్ఫ్యూ అమలు చేస్తూ, కార్్మండూ వీధుల్లో పహారా కాస్తోంది.

Tags

Next Story