UK PM Liz Truss Resign: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. తెరపైకి రిషి సునాక్ పేరు

UK PM Liz Truss Resign: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. తెరపైకి రిషి సునాక్ పేరు
UK PM Liz Truss Resign: ఒకవైపు ఇంధన కొరత.. మరోవైపు ఆర్థి వ్యవస్థ పతనం బ్రిటన్‌ సహా యూరోప్‌ దేశాలను సంక్షోభంలోకి నెట్టాయి. పెరగుతున్న ధరలను తట్టుకోలేకపోతున్నారు బ్రిటన్‌ ప్రజలు.

UK PM Liz Truss Resign: ఒకవైపు ఇంధన కొరత.. మరోవైపు ఆర్థి వ్యవస్థ పతనం బ్రిటన్‌ సహా యూరోప్‌ దేశాలను సంక్షోభంలోకి నెట్టాయి. పెరగుతున్న ధరలను తట్టుకోలేకపోతున్నారు బ్రిటన్‌ ప్రజలు. ఈ ఏడాది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి సంక్షోభం తర్వాత బ్రిటన్‌లో ద్రవ్యోల్భణం గత 40 ఏళ్ల రికార్డులను తిరగరాసింది.

దీంతో బ్రిటన్ ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం, ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పడంతో లిజ్ ట్రస్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.


బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా లిజ్ ట్రస్ పనిచేసి రికార్డుల్లోకెక్కారు. మినీ బడ్జెట్‌తో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేశారు.

ఇక 45 రోజుల కిందటే లిజ్‌ ట్రస్‌తో పోటీపడి ఓడిపోయిన రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని పదవి పోటీలో మళ్లీ తెరపైకి వచ్చారు. ట్రస్‌ రాజీనామా నేపథ్యంలో అందరు మళ్లీ రిషి సునాక్‌ వైపే చూస్తున్నారు. రేసులో ఆయనే ముందంజలో ఉన్నారు. అయితే కన్జర్వేటివ్‌ పార్టీ వ్యూహాల్లో ఎవరైనా అనూహ్యంగా తెరపైకి వచ్చే అవకాశముంది.


సునాక్‌తోపాటు మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ప్రస్తుత ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌, రాయల్‌ కౌన్సిల్‌ నేత పెనీ మోర్డౌంట్‌, రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ పేర్లు తెరపైకి వస్తున్నాయి.. అయితే వీరందరి కంటే సునాక్‌కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే బ్రిటన్‌ ఉన్న ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో ఆర్థిక మంత్రిగా ప్రశంసలు అందుకున్న సునాక్‌ కే ఛాన్స్‌ రావాలి. కానీ బ్రిటన్‌ పాలిటిక్స్‌లో రిషి కి ఇంకా అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి.

మరోవైపు రిషి సునాక్‌ పై మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే ట్రస్‌ కంటే ముందంజలో ఉన్న సునాక్‌కు వ్యతిరేకంగా జాన్సన్‌ ప్రచారం చేశారు. సునాక్‌పై కోపంతో ట్రస్‌కు మద్దతిచ్చారు. ప్రస్తుతం మళ్లీ తానే రంగంలోకి దిగాలని వ్యూహాలు పన్నుతున్నాడు.


ఒకవేళ ఆయన గెలవలేని పరిస్థితుల్లో సునాక్‌ను ఓడించటానికే జాన్సన్‌ ప్రయత్నిస్తారని బ్రిటన్‌ మీడియా అంటోంది. 2025లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటిదాకా మెజార్టీ ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థే ప్రధాని అవుతారు.


ట్రస్‌ తర్వాతి ప్రధానిని ఎన్నుకునేది కన్జర్వేటివ్‌ పార్టీయే. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ భవితవ్యానికి ఆ పార్టీ పెద్దపీట వేస్తుందా, లేదా ఇంగ్లీష్ పొలిటికల్‌ పార్టీ మరో ఎత్తుగడ వేస్తుందా అనేది చూడాలి. రిషి సునాక్‌ కి ప్రధాని ఛాన్స్‌ వస్తే భారత సంతతి నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి అవుతారు.

Tags

Next Story