Nepal PM : శ్రీ రాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

శ్రీ రాముడు తమ దేశంలోనే జన్మించాడని నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి మరోసారి తన వాదనను పునరుద్ఘాటించారు. సోమవారం ఖాట్మండులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ శ్రీరాముని జన్మస్థలం నేపాల్ భూభాగంలోనే ఉందని పేర్కొన్నార. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా తాను ఈ మాట చెబుతున్నానని వ్యాఖ్యనించారు. నేపాల్ భూభాగంలోనే రాముడు జన్మించినందున ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి ప్రజలు సంకోచించవద్దని ప్రోత్సహించారు. బహుశా కొంతమందికి అది ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ రాముడిని గౌరవించే వారికి జన్మస్థలం పవిత్రమైనది. అంతేకాకుండా రాముడు, శివుడు , విశ్వామిత్రుడు వంటి దేవతలు కూడా నేపాల్ నుండి వచ్చారని చెప్పారు. రాముడిని చాలా మంది దైవంగా భావిస్తున్నప్పటికీ, నేపాల్ ఈ నమ్మకాన్ని చురుకుగా ప్రోత్సహించడం లేదని ఆయన అన్నారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com