Los Angeles Wildfire : లాస్ ఏంజెల్స్ లో 57 వేల ఇళ్లకు కార్చిచ్చు ముప్పు

X
By - Manikanta |13 Jan 2025 2:00 PM IST
ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ నగరంలో దాదాపు 57 వేల ఇళ్లకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉందని అంచనాలున్నాయి. క్యాలిఫోర్నియాలో 12,300 ఇళ్లు, వ్యాపార నిర్మాణాలు తగలబడిపోయాయి. దాదాపు 35 వేల ఇళ్లు, వ్యాపారసముదాయాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పాలిసేడ్స్ దావానలం 23,707 ఎకరాల అడవిని దహించగా.. ఈటన్ కార్చిచ్చు కారణంగా 14,117 ఎకరాల అటవీప్రాంతం తగలబడిపోయింది. ఆ ప్రాంతాల్లోని రెండు లక్షల మందిని వేరేప్రాంతాలకు తరలించారు. మరో లక్షన్నర మంది తరలింపునకు ఆదేశాలిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com