Earthquake : మెక్సికోలో భారీ భూకంపం

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.65 తీవ్రతతో నమోదైందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. మెక్సికోలోని ఓక్సాకా తీరానికి సమీపంలో ఈ భూకంపం సంభవించిందని, దీని లోతు 10 కిలోమీటర్లు (6.2 మైళ్ళు) అని నివేదించింది. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం గురించి అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి, ఇందులో భూమిలో పగుళ్లు ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా మెక్సికోలో భూకంపాలు సంభవించాయి, మెక్సికో రెండు ప్రధాన భూకంప మండలాల్లో ఉన్నందున ఇలాంటివి సాధారణం. గత వారం కూడా మెక్సికోలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com