Malaysia: ఇకపై వీసా లేకుండానే మలేషియా

విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. కానీ, ఆ అవసరం లేకుండా భారతీయులు తమ దేశంలో పర్యటించే సౌలభ్యాన్ని థాయ్‌లాండ్, వియత్నాం, శ్రీలంకలు కల్పించాయి. తాజాగా, ఆ దేశాల సరసన మలేషియా కూడా చేరిపోయింది. భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోని సందర్శనకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆదివారం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో ప్రకటన చేశారు. పెట్టుబడులు, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆదివాదేశం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యమని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పేర్కొన్నారు.రం వెల్లడించారు. ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా దేశస్తులకు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించిన తర్వాత 30 రోజుల పాటు ఉండొచ్చని ఆయన చెప్పారు. కానీ, వీసా సౌలభ్యం భద్రత ప్రకియకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా విషయంలో కొన్ని సడలింపులు చేస్తామని గత నెలలోనే ప్రకటించిన ఆ దేశ ప్రధాని అన్వర్.. తాజాగా అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం విశేషం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచేందుకు మలేషియా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్, శ్రీలంక, వియత్నాం ప్రభుత్వాలు కూడా కల్పించాయి. నవంబర్ 10 నుంచి థాయిలాండ్ అమల్లోకి తీసుకురాగా.. వచ్చే మే 10వరకు ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే, డిమాండ్‌ను బట్టి కొనసాగించే అవకాశం ఉంటుందని థాయ్ ప్రభుత్వం వెల్లడించింది. అటు, శ్రీలంక సైతం అక్టోబరు నుంచి భారతీయులను వీసా లేకుండా అనుమతిస్తోంది. భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు ఈ వెసులుబాటు కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31వరకు ఇది అందుబాటులో ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com