Maldives: గత అధ్యక్షుడు ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారు- ముయిజ్జు

Maldives: గత అధ్యక్షుడు ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారు- ముయిజ్జు
మరోసారి పరోక్షంగా భారత వ్యతిరేకతను బయటపెట్టిన మాల్దీవుల అధ్యక్షుడు

మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మరోసారి భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ‘‘ఇండియా ఔట్’’ నినాదంలో అధికారంలోకి వచ్చిన ఇతను, వచ్చీ రాగానే మాల్దీవుల్లోని భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు చైనా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాడు.

తాజాగా మాల్దీవుల మాజీ పాలకుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌పై అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తన పదవీకాలంలో ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారని, దేశ స్వతంత్రతను పరాయి దేశం చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ఆ దేశం, రాయబారి పేరు ప్రస్తావించనప్పటికీ.. భారత్‌తో విభేదాలు కొనసాగుతోన్న వేళ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తుర్కియే నుంచి డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి ఎదురవుతోన్న విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో ఈమేరకు స్పందించారు.

2018-23 వరకు అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, దేశ స్వతంత్రను కాపాడటంలో విఫమైందని ఆరోపించారు. దేశాన్ని విదేశీ చేతుల్లో పెట్టాడని ఆరోపించారు. ఆర్థికంతో సహా అన్ని విషయాల్లో స్వాతంత్ర్యాన్ని కోల్పోయామని, ఫలితంగా దేశానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, మేం చేస్తున్న ప్రయత్నాలను వారు అంగీకరించరని ముయిజ్జూ అన్నారు.

గత అధ్యక్షుడు సోలిహ్ ప్రభుత్వం చాలా విషయాల్లో భారత్‌కి మంచి మిత్రుడిగా ఉన్నారు. చైనాను కాదని భారత అనుకూల విధానాలను అనుసరించారు. పాలనాపరంగా భారత్‌పై సోలిహ్ ఆధారపడ్డారని ప్రస్తుతం ముయిజ్జూకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పీఎన్సీ) ఆరోపిస్తోంది. తాజాగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే పరోక్షంగా భారత్ గురించి ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాడని తెలుస్తోంది. భారత్‌ని ఇన్నాళ్లుగా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న ముయిజ్జూ ఇటీవల మాట్లాడుతూ.. రుణాల నుంచి విముక్తి పొందేందుకు భారత్ తమకు ఎన్నటికి మిత్రదేశమని వ్యాఖ్యానించారు. రుణాల నుంచి విముక్తి కోరుతున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story