Face book Love : సారీ..నేను అలాంటిదాన్ని కాదు..

Face book Love : సారీ..నేను అలాంటిదాన్ని కాదు..
మాది ప్రేమ కాదు స్నేహమే.. కానీ..

దేశం దాటి పాకిస్తాన్‌ వెళ్లిన అంజూ తాను సురక్షితంగానే ఉన్నట్లు తెలిపింది. పాకి‌స్తాన్‌లో తన స్నేహితుని వివాహ వేడుకలో పాల్గొనేందుకే వచ్చానని, 2 నుంచి 4 రోజుల్లో భారత్‌కు రానున్నట్లు తెలిపింది. తాను సీమా హైదర్‌లా కాదని, నస్రుల్లాను పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. అన్ని నిబంధనలు పాటించే తాను పాకిస్తాన్‌ వచ్చా నని చెప్పిన అంజు, ఈ విషయం తన భర్తకు చెప్పలేదని మాత్రం అంగీకారించింది. 2020లో నస్రుల్లా తనకు ఫేస్‌బుక్‌లో పరిచయం అయినట్లు తెలిపింది. అయితే మాటల్లో అంజు తన భర్త నుంచి విడాకులు కావాలని కోరుకుంటున్నట్లు పేర్కోంది. మరోవైపు ఆమె భారత్‌కు తిరిగి వస్తుందా.. లేదా సీమా హైదర్‌ లాగా ప్రేమించిన వాడితో అతని దేశంలోనే ఉండిపోవాలని అనుకుంటోందా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


పాక్‌కు చెందిన సీమా హైదర్‌ అనే మహిళ మే నెలలో భర్తను వదిలి నలుగురు పిల్లలతో సహా పబ్జీలో పరిచయమైన భారత్‌లోని ప్రియుడి చెంతకు చేరింది. సంఘటన జరిగిన సరిగ్గా 2 నెలల తర్వాత జులై 21న రాజస్థాన్‌ భివాండీకి చెందిన అంజు అనే వివాహిత ఫేస్‌బుక్‌ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్తాన్‌ వెళ్లింది. అయితే భర్తకు మాత్రం అమృత్‌సర్‌కు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని అబద్ధం చెప్పింది. 34 ఏళ్ల అంజుకు ప్రైవేటు సంస్థలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అరవింద్‌తో 2007లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. పాక్‌కు చెందిన 29 ఏళ్ల నస్రుల్లా ఖాన్‌తో ఆమెకు 2020లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఆ స్నేహితుడ్ని ఎలాగైనా చూడాలని నిర్ణయించుకున్న అంజు.. సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు వెళ్లింది. పాకిస్తాన్‌ నుంచి భర్తకు అంజు వాయిస్‌ కాల్‌ చేసి తాను పాకిస్థాన్‌లో ఉన్నానని చెప్పింది. దీంతో ఆయన కాస్త షాక్‌ అయ్యాడు. రెండు రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పిన అంజు మిగతా వివరాలు ఏమీ భర్తకు తెలియనివ్వలేదు.

అయితే భర్త మాత్రం ఇన్నేళ్లలో అంజుపై తనకు అనుమానం రాలేదని, ఆమె పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విషయమే తనకు తెలియదన్నాడు. మరోవైపు ఈ అంశంపై రాజస్థాన్‌ పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. ప్రేమ వ్యవహారమే ఆమె ప్రయాణానికి కారణమని భావిస్తున్నారు.అంజు, నస్రుల్లాఖాన్‌ తరచూ వీడియో కాల్‌లు మాట్లాడకున్నారని పేర్కొన్నారు.అంజు 2020లో పాస్‌పోర్టు అప్లై చేసిందని నిర్ధరించారు. ఆమె భారత్‌కు వస్తే విచారిస్తామని తెలిపారు. ఒకవేళ పాస్‌పోర్ట్‌ చట్టం ప్రకారం నకిలీ డాక్యుమెంట్లతో ఆమె పాక్‌కు వెళ్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story