Japan : జపాన్ లో భారీ భూకంపం

Japan : జపాన్ లో భారీ భూకంపం
X

జపాన్లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం క్యుషు ప్రాంతంలో గురువారం తెల్ల వారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్స్కైల్ప తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది. జపాన్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ జపాన్లో ని క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీ కృతమై ఉంది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరో పక్క జపాన్ కు వాతావరణ శాఖ సునామీ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దీవులైన క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సముద్రం, నదీ తీరాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. దాంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపకేంద్రం సమీపంలోని విమానా శ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

క్యుషు ద్వీపంలోని నిచినాన్, మియాజాకి సమీపంలోని కొన్ని ప్రాంతాలపై భూకంపం ప్రభావం ఎక్కువగా కనిపించింది. 1.6 అడుగుల ఎత్తులో అలలు కనిపించినట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారులు నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్లు చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ చెప్పారు. క్యుషు, షికోకు ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగానే ఉన్నాయని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ వెల్లడించింది. 2011లో సంభవించిన భూకంపం, సునామితో పుకుషిమా అణుకేంద్రం దెబ్బతింది. భూకంపం వచ్చనప్పుడల్లా న్యూక్లియర్ ప్లాంట్స్ భద్రతపై ఆందోళన వినిపిస్తోంది.

Tags

Next Story