Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్‌కు మందు వచ్చేసింది.. త్వరలో ఇండియాలో కూడా..

Omicron Variant (tv5news.in)
Omicron Variant: సౌత్ ఆఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పుట్టినప్పటి నుండి దాని గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో ఏవి నిజాలో, ఏవి వదంతులో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒమిక్రాన్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని తెలిసిన తర్వాత చాలామంది ప్రజలు దీని గురించి ఎక్కువగా భయపడుతున్నారు. అయితే ఇక ఒమిక్రాన్ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు బ్రిటన్‌కు వైద్యులు.
కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పరిశోధకులు ఎంతో కష్టపడిన తర్వాత రెండు రకాల వ్యాక్సిన్‌లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కోవిడ్ సోకకుండా ఉండేలా మరింత సమర్థవంతంగా ఉండేలా బూస్టర్ డోస్‌లను కూడా తయారు చేశారు. అవి కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి చాలానే కష్టపడ్డాయి. అదే విధంగా ప్రస్తుతం ఒమిక్రాన్‌కు కూడా ఔషధం వచ్చేసింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ గ్లాక్సోస్మిత్ క్లైన్ ఒమిక్రాన్ వేరియంట్‌ను అరికట్టగల ఔషధాన్ని కనిపెట్టడం కోసం కొన్నిరోజులుగా ప్రయత్నం చేస్తోంది. ఇన్నాళ్లకు వాళ్ల ప్రయత్నం ఫలించింది. ఒమిక్రాన్‌తో పోరాడే ఈ ఔషధం పేరే 'సొట్రోవిమాబ్'. పరిశోధకులు ఒమిక్రాన్‌ను పోలిన వైరస్‌పై ఈ మందును ప్రయోగించగా, అన్ని మ్యూటేషన్లను ఇది అణచివేసినట్టు తయారీ సంస్థ తాజాగా ప్రకటించింది.
సొట్రోవిమాబ్‌ను కోవిడ్ పేషెంట్స్‌కు ఇవ్వగా 79 శాతం వారికి నయమయిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అందుకే బ్రిటన్ ప్రభుత్వం ఈ ఔషదాన్ని మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి అనుమతిని ఇచ్చింది. 7,50,000 డోసుల సొట్రోవిమాబ్‌ను ఇతర దేశాలకు పంపించేలా సన్నాహాలు మొదలుపెట్టింది. కాకపోతే ఈ ఔషదాన్ని కోవిడ్ లక్షణాలు కనిపించిన అయిదు రోజుల్లోనే ఇస్తే ఇది సమర్ధవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com