హర్మూజ్ ఓపెన్.. యుద్ధం ముగిసినట్టేనా..?

హర్మూజ్ ఓపెన్.. యుద్ధం ముగిసినట్టేనా..?
X

పశ్చిమాసియా యుద్ధానికి భారీ బ్రేక్ పడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా దేశాలు అంగీకరించాయి. నిన్న ట్రంప్ తన సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. ఈ రాత్రికి ఇరాన్ ను ఏం చేస్తాయో ప్రపంచం చూస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించారు. కానీ కొద్ది సేపటికే సీజ్ ఫైర్ కు ఒప్పందం కుదిరింది. హర్మూజ్ ఓపెన్ చేయడానికి ఇరాన్ కూడా ఒప్పుకుంది. దీంతో ఇక యుద్ధం ముగిసినట్టే అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అటు ఇరాన్ మాత్రం తమ డిమాండ్లకు ఒప్పుకోవాల్సిందే అని పట్టుబడుతోంది. కానీ ట్రంప్ మాత్రం తన కండీషన్లకు ఇరాన్ ఒప్పుకుందని చెబుతున్నారు. ఇలా రెండు దేశాల వాదనలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి.

కానీ ఇరు దేశాలు కూడా యుద్ధానికి ముగింపు పలకడానికే ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల ఇరు పక్షాలు భారీగా నష్టపోతున్నాయి. ఆ ప్రభావం ఆ దేశాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అటు అమెరికా ప్రజలు కూడా ట్రంప్ కు మద్దతు తెలపట్లేదు. ఇటు ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోతోంది. తన సంపద మొత్తాన్ని కోల్పోతోంది. అందుకే రెండు దేశాలు ఆర్థికంగా నిలబడేందుకు ఈ నిర్నయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ రెండు వారాల గడువులోపు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటే అని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు ఎక్కువ మేలు జరుగుతుంది. చమురు ధరలు దిగొచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. అందుకే ఇరాన్ నుంచి యుద్ధం ముగింపు అనే ప్రకటన వచ్చే దాకా ఎలాంటి క్లారిటీ ఉండదనే చెప్పుకోవాలి.

Tags

Next Story