Middle East War Impact : అన్ని రంగాలపై యుద్ధం ఎఫెక్ట్..!

మిడిల్ ఈస్ట్ యుద్ధం యుద్ధం ఎఫెక్ట్ భారత్ లోని దాదాపు అన్ని రంగాలపై పడుతోంది. ఇప్పటికే గ్యాస్ దొరకక హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడుతున్నాయి. ఇంకోవైపు రొయ్యల ఎగుమతి ఆగిపోయింది. అంతే కాకుండా బియ్యం ఎగుమతులు, కోడిగుడ్లు, మాంసం.. ఇలా ఎన్నో రకాల రంగాల ఎగుమతులు ఆగిపోతున్నాయి. గ్యాస్ దొరకక చాలా రంగాలు నిలిచిపోతున్నాయి. ఇది డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా కోట్లాది మంది భారతీయులపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇప్పటికే హోటల్ సిబ్బందికి పని ఆగిపోయింది. వారి ఉద్యోగాలు గాల్లో దీపాలు అయిపోయాయి. పనిలేక చాలా మంది సొంతూర్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఐటీ కారిడార్ లో హాస్టళ్లు మూతపడుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని వారు అడుగుతున్నారు. ఇంకోసైడ్ వంటింటి సామాన్ల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గ్యాస్ మీద ఆధారపడి నడిచే రంగాల్లో తయారయ్యే వస్తువుల ధరలు కొండెక్కుతున్నాయి. యూరియా కంపెనీల్లో గ్యాస్ కొరతతో వాటి ఉత్పత్తులు కూడా ఆగిపోతున్నాయి. దీంతో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. ఇలా ఒకటా రెండా.. ఎన్నో రంగాలపై ఇండియాలో ఎఫెక్ట్ పడుతోంది.
దీంతో ఆయా రంగాల్లో ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య లక్షలకు చేరుకుంటోంది. ఇంకొన్ని రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే ఆల్మోస్ట్ లాక్ డౌన్ పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. ఇండియా ఎక్కువ దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకోవడం వల్ల ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం కూడా సీరియస్ గా చర్యలు తీసుకుంటోంది. వెంటనే గ్యాస్ ఉత్పత్తులు కూడా పెంచుతోంది. మరి ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయో చూడాలి.
Tags
- Middle East War
- India Economy Impact
- Gas Shortage India
- LPG Crisis India
- Export Halt India
- Shrimp Export India
- Rice Export India
- Egg Export India
- Meat Export India
- India Hotel Industry Crisis
- Hostel Closures India
- IT Corridor Issues India
- Work From Home Demand India
- Fertilizer Urea Shortage India
- Rising Food Prices India
- Gulf Imports India
- Employment Crisis India
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
