America : అమెరికాలో విమానం మిస్సింగ్

America : అమెరికాలో విమానం మిస్సింగ్
X

అమెరికాలో విమానం అదృశ్యమైంది. 10 మందితో అలస్కా మీదుగా ప్రయాణిస్తున్న ఫ్లైట్ రాడార్ సిగ్నల్స్‌కు అందకుండా పోయింది. దీంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇటీవల వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు వద్ద ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో విమానం పోటోమాక్ నదిలో కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 67 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు.

విమానం అదృశ్యమయ్యే ముందు పైలట్ ఆంకరేజ్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు హోల్డింగ్ ప్యాటర్న్‌లోకి ప్రవేశించే విషయమై మాట్లాడారు.నోమ్ వద్ద రన్ వే క్లియరెన్స్ కోసం ఆయన ఏటీసీతో మాట్లాడారు. అదృశ్యమైన విమానం కోసం గాలిస్తున్నామని నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్ టీ ఎస్ బీ తెలిపింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎప్ఏఏ దీనిపై వెంటనే స్పందించేందుకు నిరాకరించింది.

Tags

Next Story