Monkey Fox : మంకీ పాక్స్‌కు టీకా.. ముందుగా ఆఫ్రికాలో పంపిణీ
ఆఫ్రికా దేశాలను హడలెత్తిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ పై పోరాటం దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వినియోగానికి సంబంధించి వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్దలలో దీని వాడకానికి ఆమోదం తెలిపింది. ఆఫ్రికాతోపాటు, ఇతర ప్రాంతాల్లోని బాధితులు వ్యాధితో పోరాడటానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అని తెలిపింది.
బవేరియన్ నార్డిక్ సంస్థ అభివృద్ధి చేసిన ఎంపాక్స్ టీకాను వ్యాక్సిన్ అలయన్స్ గావీతోపాటు యునిసెఫ్ వంటి సంస్థలు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. తయారీ సంస్కృఒక్కటే అయినందున, ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వీటి ఉత్పత్తి జరుగుతోంది. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ టీకా అందించేందుకు ముమ్మర చర్చలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చింది.
ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే టీకా ఇవ్వనున్నారు. అదికూడా ఒక డోస్ మాత్రమే ఇస్తారు. అయితే, వ్యాధి తీవ్రత, ప్రాణాంతక పరిస్థితులలో 18 ఏళ్ల లోపువారికి, చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి డబ్ల్యుహెచ్ఎ అనుమతి ఇచ్చింది. ఆఫ్రికాలో ప్రస్తుతం వ్యాధి ప్రబలంగా ఉంది. భవిష్యత్ లో వ్యాప్తిని కూడా అరికట్టేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకుంటోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com