Libiya: ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు

Libiya: ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు
5,300 కి పైగా చేరుకున్న మరణాలు

లిబియాలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల దెబ్బకి వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి వేలమంది ప్రాణాలను కోల్పోయారు. సముద్రానికి చేరువలో ఉన్న డెర్నా నగరంలో చెప్పలేనంత విషాదం నెలకొంది. ఆ నగరం లోయలో ఉండగా, ఎగువన పర్వతాల్లో రెండు డ్యామ్‌లు ఉన్నాయి. అవి రాత్రి వేళ బద్దలు కావడంతో అనూహ్య ప్రమాదం వాటిల్లింది. ఈ సమయంలో నిద్రలో ఉన్న ప్రజలంతా వరదలో చిక్కుకొని సముద్రంలోకి కొట్టుకుపోయారు. అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. ఈ దుర్ఘటనలో 5,300 మందికి పైగా మరణించారు. వరద నీటి ఉదృతికి 10000 మందికి పైగా గల్లంతయ్యారు. 7000 క్షతగాత్రులయ్యారు.


లిబియాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈజిప్ట్, జర్మనీ, ఇరాన్, ఇటలీ, ఖతర్, తుర్కియే లు ప్రకటించాయి. టర్కీ సహా ఇతర దేశాలు సహాయ కార్యక్రమాల తమ బృందాలను లిబియా పంపాయి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ క్రీసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్‌సీ) వలంటీర్లు ముగ్గురు మరణించారు. దాదాపు 1.25 లక్షల కుటుంబాలు నివాసముండే డెర్నాలో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. కార్లు తేలుతూ కొట్టుకుపోయాయి. వీధులు మునిగిపోయాయి. పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. రోడ్లపైన, ఆసుపత్రి ప్రాంగణాల్లో శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకుంటున్న ప్రజలు కన్నీటితో తమ వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


లిబియా సాంఘిక మాధ్యమాల ప్రకారం ఎక్కడ చూసిన మృత దేహాలు కుప్పలు తిప్పలుగా పది వున్నాయి.. దహన సంస్కారాలకు స్మశాన వాటికలో క్యూ లో ఉండాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.. సోమవారం రోజే 300 కంటే ఎక్కువ మంది మృత దేహాలని ఖననం చేశారు.. ఇంకా ఖననం చేయాల్సిన మృత దేహాలు వందల్లో ఉన్నాయి. ఈ వరద దాటికి కార్లు, ఇల్లులు కనుమరుగయ్యాయి. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం జరిగిందని డెర్నా అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డెర్నా లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాను, గాలి వేగం, భారీ వర్షాలు, సముద్ర మట్టం, వరదలపై ఎలాంటి శాస్త్రీయ అంచనాలు, హెచ్చరికలు లేకపోవడం వల్లనే ఇంతటి ముప్పు వాటిల్లింది.

Tags

Read MoreRead Less
Next Story