Morocco Country : ప్రపంచంలోనే సంపన్న దేశం మొరాకో.. విశేషాలు ఇవే

Morocco Country : ప్రపంచంలోనే సంపన్న దేశం మొరాకో.. విశేషాలు ఇవే
X

ఎటు చూసినా ఖరీదైన కార్లు.. కళ్లుచెదిరే భవనాలు.. విలాస వంతమైన జీవితం.. ఆదాయపు పన్ను మినహాయింపులు.. వీధుల్లో లంబోర్గిని, రోల్స్ రాయిస్ వంటి సూపర్ లగ్జరీ కార్ల ప్రయాణం. ఇక తీరంలో ఫ్లోటింగ్ మాన్షన్స్. అలా అక్కడ జీవితం దాదాపు స్వర్గసమానమే. ఇంతకీ అదెక్కడ అనుకుంటున్నారా ఆ దేశం పేరు మొరాకో. జనాభా 38వేలు మాత్రమే. కానీ ప్రపంచంలోనే అత్యధిక మంది సంపన్నులున్న దేశంగా రికార్డుకెక్కింది. మొరాకో దేశంలో నివాసం ఉండాలని చాలామంది. కోరుకుంటారు. పేరుకు చిన్న దేశమే కానీ, సంపదలో మాత్రం అగ్రదేశాలను తలదన్నేలా ఉంటుంది. మొరాకో పేరు పురాతన గ్రీకు పదం మోనోకోస్ నుండి వచ్చింది. మొనాకోస్ అంటే విశిష్టమైనది. అని అర్థం. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఎక్కువ మంది మొరాకోకు వెళ్లాలని కలలు కంటుంటారు. మొరాకో తీరం నీటిపై తేలియాడే భవనాల మాదిరిగా కనిపించే విలాసవంతమైన పడవలతో నిండివుంటుంది. ఇది వాటికన్ నగరం తర్వాత ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం. కానీ సంపద పరంగా ప్రపంచంలో చాలా పెద్దస్థానం కలిగివుంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం మొరాకో తలసరి 2,56,580.5 డాలర్లు (రూ.2.18కోట్లు). ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో తలసరి ఆదాయం 82,769.4 డాలర్లు మాత్రమే. దీన్నిబట్టి మొరాకో ఎంత సంపన్నదేశమే అర్థంచేసుకోవచ్చు.

Tags

Next Story