Elon Musk : మస్క్ స్టార్ లింక్ తో జియో అగ్రిమెంట్.. ఎయిర్ టెల్ బాటలోనే!

ఎలాన్ మస్క్ కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ రిలయన్స్ గ్రూప్ల కు చెందిన డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఇంతకు ముందు ఎయిర్టెల్ కూడా స్టార్ లింక్ తో అవగాహన ఒప్పందం చేసు కుంది. ఒక్క రోజు తేడాతో జియో కూడా అదే బాటలో నిడిచింది. స్టార్అంక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. వినియోగదారులకు అత్యంత వేగ వంతమైన నెట్ అందిచేందుకు తాము జతకట్టినట్లు ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. అనుమతులు వచ్చిన తరువాత భారత్లో స్టార్ లింక్ సంస్థ సేవలు జియో, ఎయిర్టెల్ ద్వారా అందనున్నాయి. దేశంలో అందరికీ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ అందేలా చూసేందుకు ఈ భాగస్వామ్యం ఒక కీలక అడుగుని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థతో స్టార్ లింక్ ను అనుసంధానించడం ద్వారా పరిధిని మరింత విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందం ఏఐ ఆధారితయుగంలో హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ విశ్వసనీయతను పెంచనుందని తెలిపింది. జియో తన రిటైల్ అవులేట్లు, ఆన్లైన్ వేదికగా స్టార్అంక్ సేవలు అందుబాటులోకి తీసుకు రానుంది. రెండు కంపెనీలు సరస్పరం తమ ప్రయోజనాలను అందిపుచ్చుకుని ముందుకు సాగనున్నాయని ఈ ప్రకటనలో తెలిపింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com