Australia: కొనసాగుతోన్న ఉత్కంఠ

ఆస్ట్రేలియా తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు కలకలం రేపుతోంది. భారీ పరిమాణంలో ధ్వంసమైన స్థితిలో ఉన్న ఆ స్థూపాకారపు రాగి రంగు లోహాపు వస్తువు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలోకి ఇది కొట్టుకువచ్చింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన అధికారులు.. ఆ వస్తువుకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. అసలు అది ఎక్కడినుంచి వచ్చింది? ప్రమాదకరమా? కాదా? అని తేల్చేపనిలో పడ్డారు.
మరోవైపు, ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ కూడా ఈ వస్తువుపై దర్యాప్తు ప్రారంభించింది. ఏదైనా విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనానికి సంబంధించినది కావొచ్చని అంచనావేసింది. ఈ విషయమై ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ వస్తువు ఎక్కడిదో తెలియని నేపథ్యంలో దానికి దూరంగా ఉండాలని, కదిపే ప్రయత్నం చేయొద్దని సూచించింది. అయితే, ఆ వస్తువు భారత్‌కు చెందిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు సంబంధించినదిగా భావిస్తున్నట్లు అంతరిక్ష నిపుణురాలు చెప్పారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు తరువాతే ఓ అంచనాకు రాగలమని స్పష్టం చేశారు.
ఆ వస్తువు ఏమయ్యి ఉండొచ్చని ఆ ప్రాంత అధికారులు విచారణను ప్రారంభించారు.అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న వస్తువుకు సంబంధించి తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వరుస ట్వీట్లలో తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న ఈ వస్తువుకు సంబంధించిన విచారణలు చేస్తున్నామని. ఆ వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుంచి వచ్చి ఉండవచ్చుని భావిస్తున్నామని తెలిపారు.మరింత సమాచారాన్ని కోసం ఎక్స్‌ఫర్ట్స్ తో మాట్లాడుతున్నామని ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ ట్వీట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com