West Bengal : వెస్ట్ బెంగాల్ హింసపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింసపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు దర్యాప్తు విభాగం నుంచి ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. అల్లర్లపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టినట్లు NHRC తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రర్థనలు ముగిసిన తరువాత ముర్షిదాబాద్ తో సహా సుతి, ధులియన్, సంసేర్‌గంజ్ మరియు జంగీపూర్ ప్రాంతాల్లో మింస చెలరేగింది. ఈ హింసలో ముగ్గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. వక్ఫ్ సవరణ చట్ట వ్యతిరేక నిరసనల్లో ముస్లింలు అధికంగా నివసించే జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 221 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముర్షిదాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు తొమ్మిది కంపెనీలకు చెందిన BSF దళాలు 900 మందిని మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అదనపు కంపెనీలతో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ముర్షిదాబాద్ హింసపై ప్రాథమిక దర్యాప్తు గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కి స్పందించింది. ఇది బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉండొచ్చని అనుమానించింది. కేంద్ర హోం కార్యదర్శి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి ,డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో అల్లర్లపై సమీక్ష నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com