25 Oct 2022 10:38 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Rishi Sunak: దేశాన్ని...

Rishi Sunak: దేశాన్ని గాడిలో పెట్టగల సత్తా రిషికి మాత్రమే..: బ్రిటన్ వాసులు..

Rishi Sunak: మెజారిటీ ఎంపీలు ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంచడంతో ఎలాంటి పోటీ లేకుండా రిషి ప్రధాని పీఠాన్ని ఎక్కబోతున్నారు.

Rishi Sunak: దేశాన్ని గాడిలో పెట్టగల సత్తా రిషికి మాత్రమే..: బ్రిటన్ వాసులు..
X

Rishi Sunak: రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించడం తమకు మాత్రమే తెలుసంటూ.. నిన్న మొన్నటి వరకు చెప్పుకొచ్చిన బ్రిటన్‌కు ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు..మెజారిటీ ఎంపీలు ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంచడంతో ఎలాంటి పోటీ లేకుండా రిషి ప్రధాని పీఠాన్ని ఎక్కబోతున్నారు.


బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ఇప్పుడున్న పరిస్ధితుల్లో దేశాన్ని గాడిలో పెట్టగల సత్తా రిషికి మాత్రమే వుందని.. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారంటే భారతీయుల సత్తా ఎలాంటిదో ఆర్ధమవుతుందని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో 1980 మే 12న రిషి సునాక్ జన్మించారు. రుషి తల్లిదండ్రులు ఉష,యశ్‌వీర్. వీరి మూలాలు భారత్‌లోని పంజాబ్‌లో వున్నాయి. వీరు టాంజానియా, కెన్యాలలో కొన్నాళ్లు ఉండి తర్వాత బ్రిటన్‌కు వలస వచ్చారు. సునాక్ తండ్రి యశ్‌వీర్ డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోగా.. తల్లి మెడికల్ షాపు నిర్వహించేవారు.


ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, ఎకనామిక్స్‌ చదువుకున్న రిషి సునాక్ తర్వాత గోల్డ్ మాన్ శాచ్స్‌లో పనిచేశారు. అలాగే హెడ్జ్ ఫండ్స్‌ పార్ట్‌నర్‌గానూ వున్నారు. ఈ సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

మరోవైపు కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో నారాయణమూర్తి కుమార్తె అక్షతతో రిషి సునాక్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్ల పరిచయం తర్వాత రిషి సునాక్ ,అక్షత కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.


అయితే అక్షత తన తండ్రి నారాయణమూర్తికి రిషి సునాక్ గురించి చెప్పినప్పుడు తొలుత ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. సునాక్‌తో ఒకసారి మాట్లాడి చూడాలని ఆమె కోరారు. రిషి సునాక్‌తో మాట్లాడిన తర్వాత నారాయణమూర్తి ఆలోచన పూర్తిగా మారిపోయింది.


'నేను రుషిని కలిశాను. నువ్వు నాకు చెప్పిందంతా నిజమే. రిషి బ్రిలియంట్, అందగాడు, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అన్నింటికంటే మించి అతడి నిజాయితీ నచ్చింది' అని నారాయణమూర్తి తన కుమార్తె అక్షతకు రాసిన లేఖలో రాశారు. ఈ విషయాన్ని 'లెగసీ: లెటర్స్ ఫ్రమ్ ఎమినెంట్ పేరెంట్స్ టు దేర్ డాటర్స్' అనే పుస్తకంలో నారాయణ మూర్తి ప్రస్తావించారు.

ఇక రిషి హిందూ కుటుంబంలో జన్మించడంతో చిన్నప్పటి నుంచి ఆలయాలను సందర్శించేవారు. ఆయన తాతగారు రామ్ దాస్ సునాక్ ఆలయ స్థాపక సభ్యుడు కావడంతో సౌతాంప్టన్‌లోని హిందూ సొసైటి టెంపుల్‌ అంటే రిషి ఎంతో ఇష్టపడేవారు.


అంతేకాదు పార్లమెంట్‌లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు..తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటారు.తరచూ ఆలయాలకు వెళ్తూ..గో పూజ'కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.తాను మంసం ముట్టనని పూర్తి శాకాహరి కావడంతోనే అనేక విజయాలు సాధించానని రిషి గర్వంగా చెప్పుకుంటారు.

చిన్నప్పటి నుంచే రిషికి పాలిటిక్స్‌ పై ఇంట్రెస్ట్ ఉంది. చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్‌షిప్ చేశారు. 2014లో పూర్తి స్థాయి పాలిటిక్స్‌లతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 2015లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా గెలిచారు.


ఆ తర్వాత 2017, 2019 ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019లో బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఎన్నికవ్వడంతో రిషికి ఆర్ధిక శాఖలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. కరోనా సమయంలో తన అద్భుత పనితీరుతో రైజింగ్ స్టార్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రిషి.


2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా ప్రమోషన్ ఇచ్చాడు బోరిస్. తర్వాత పార్టీ గేట్ వివాదంలో జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో నెక్ట్స్‌ పీఎం ఎవరన్న సమయంలో కూడా రిషి సునాక్ పేరు మారుమోగింది. కానీ అనూహ్యంగా లిజ్ ట్రస్‌ అవకాశం దక్కించుకున్నారు. తిరిగి అందరి మద్దతుతో బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు.

Next Story