New Varient Corona Virus: కొత్త రకం కరోనా.. మేడిన్ జపాన్
New Varient Corona Virus in Japan
New Varient Corona: Virus: చచ్చీ చెడీ చైనా వైరస్ నుంచి తప్పించుకున్నాం కదా అనుకుంటే.. ఇప్పుడు జపాన్ మరో కొత్త రకం కరోనా రెక్కలు చాస్తోందట. కొత్త రకం ఎలక్ట్రానిక్ వస్తువులకు వేదికైన జపాన్‌లో ఇప్పటికే ఈ కొత్త రకం కరోనాకి సంబంధించిన కేసులు నమోదయ్యాయట. తూర్పు జపాన్‌లోని కాంటే ప్రాంతంలో 91 కేసులు, విమానాశ్రయాల్లో రెండు కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో జపాన్ రాజధాని టోక్యో ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. జపాన్‌లో ఇప్పటికే వెలుగు చూసిన కోవిడ్ కేసుల కంటే ఇది భిన్నంగా ఉందని.. కనుక ఇది వేరే దేశాల్లో వృద్ధి చెంది ఉంటుందని ఇక్కడి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్ డిసీజెస్ వెల్లడించింది. వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీసే E484K మ్యూటేషన్‌ను, ఈ కొత్త రకం కరోనా వైరస్‌లో కనుగొన్నట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు.
ఈ కొత్త వైరస్ వ్యాప్తి కూడా చాలా త్వరగా జరుగుతుందని.. తద్వారా దేశంలో వైరస్ కేసుల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా కరోనా వైరస్ నిర్మూలనకు తీసుకువచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ ఈ కొత్త తరహా కరోనాకు పనిచేయక పోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో జపాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతోంది. కరోనాకి వ్యాక్పిన్ కూడా ఈ వారమే ప్రారంభమైంది అక్కడ. అంతలోనే ఈ కొత్త వైరస్ వచ్చి కొత్త తలనొప్పులు తీసుకువస్తోందని అధికారులు వాపోతున్నారు.
Also Read: దేశంలో ఉరికంబం ఎక్కనున్న తొలి మహిళ.. ప్రియుడి కోసం ఏడుగురిని..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com