దేశంలో ఉరికంబం ఎక్కనున్న తొలి మహిళ.. ప్రియుడి కోసం ఏడుగురిని..

దేశంలో ఉరికంబం ఎక్కనున్న తొలి మహిళ.. ప్రియుడి కోసం ఏడుగురిని..
సాధారణంగా ఉన్నత చదువులు చదువుకున్నవారు మంచి చెడు ఆలోచిస్తున్నారని, తొందరపడి నిర్ణయాలు తీసుకోరని అనుకుంటాము.

కొన్ని దారుణ ఘటనల్లో మగవారే దోషులుగా ఉంటారు. వారికే ఉరిశిక్షలు అమలవుతుంటాయి. కానీ ఆశ్చర్యంగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు కానుంది.. ఇంత కఠినమైన శిక్షను అమలు చేయడానికి ఆమె చేసిన ఘోరం ఏమైవుంటుంది. స్వాతంత్ర్యానంతరం దాదాపు 150 ఏళ్ల తరువాత ఓ మహిళకు ఉరిశిక్ష వేయడానికి రంగం సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షబ్నమ్ డబల్ ఎంఏ (ఇంగ్లీష్, జాగ్రఫీ) చదువుకుంది.

గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పింది. సాధారణంగా ఉన్నత చదువులు చదువుకున్నవారు మంచి చెడు ఆలోచిస్తున్నారని, తొందరపడి నిర్ణయాలు తీసుకోరని అనుకుంటాము. అందునా మహిళలు మరింత సౌకుమార్యంగా ఉంటారని తలపోస్తాము. కానీ షబ్నం ప్రేమించిన ప్రియుడి కోసం కన్నతల్లిదండ్రులతో పాటు తోబుట్టువులను, అభం శుభం తెలియని ఓ చిన్నారితో మొత్తం ఏడుగురు కుటుంబసభ్యుల్ని గొంతు నులిమి చంపేసింది. ఇందుకు ఆమె ప్రియుడి సహకారం కూడా తోడైంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ ఇద్దరికీ ఉరిశిక్ష అమలు చేస్తోంది న్యాయస్థానం.

ప్రేమ పగని కోరుకుంటుంది.. ప్రేమించిన వారి కోసం ఎంతటి అఘాయిత్యానికైనా సిద్ధపడుతున్నారు. బాగా చదువుకున్న వారు సైతం క్షణికావేశంలో హత్యలు చేస్తున్నారు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

షబ్నమ్ ఇంటి పక్కనే ఓ కట్టె కోత మెషీన్ ఉండేది. అందులో సలీమ్ అనే వ్యక్తి కార్మికుడిగా పని చేస్తుండేవాడు. షబ్నమ్‌కు అతడితో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి అది శారీరక సంబంధానికి దారి తీసింది. వీరి ప్రేమ వ్యవహారం ఆమె కుటుంబసభ్యులకు మింగుడు పడలేదు. ఆమెని అతడితో కలవకుండా కట్టుదిట్టం చేశారు. షబ్నం మాత్రం అతడిని వదులుకోలేనని పట్టుబట్టింది. అతడినే పెళ్లి చేసుకుంటానని అమ్మానాన్నతో గొడవపడింది.

కర్మాగారంలో కూలి పని చేసుకునే వ్యక్తికి కూతురిని ఇచ్చి పెళ్లి చేయడాన్ని ససేమిరా అంగీకరించలేకపోయారు షబ్నం తల్లిదండ్రులు. మరోసారి గట్టిగా మందలించారు. అయినా లాభం లేదని కూతురిని గదిలో పెట్టి బంధించారు. ప్రియుడిని కలవకుండా చేశారనే కోపంతో షబ్నమ్ కుటుంబసభ్యులపై కక్ష పెంచుకుంది. సలీంతో కలిసి స్కెచ్ గీసింది. తాను మారినట్లు కుటుంబసభ్యులను నమ్మించింది.

హసన్‌పూర్ పట్టణమైన అమ్రోహాకు ఆనుకొని ఉన్న బావన్‌ఖేడి అనే చిన్న గ్రామంలోని ప్రజలు, ఏప్రిల్ 14, 2008 మధ్య రాత్రి జరిగిన ఘోర సంఘటనను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ రోజున షబ్నమ్, అమెతో పాటు ప్రేమికుడు సలీం, తండ్రి మాస్టర్ షౌకత్, తల్లి హష్మి, సోదరులు అనీస్, రషీద్, బావ అంజుమ్ అతని సోదరి రబియాను గొడ్డలితో నరికి చంపారు. షబ్నమ్ తన మేనల్లుడు అర్ష్ ను గొంతు నులిమి చంపేసింది. సలీమ్‌తో తన ప్రేమ వ్యవహారం కొనసాగించేందుకు కుటుంబసభ్యులు అడ్డుగా మారుతున్నారని భావించి అందర్నీ చంపేసింది షబ్నమ్ ప్రియుడితో కలిసి.

ఈ కేసును రెండు సంవత్సరాల మూడు నెలల పాటు అమ్రోహా కోర్టులో విచారించారు. ఆ తరువాత, 15 జూలై 2010 న, జిల్లా న్యాయమూర్తి ఎస్‌ఐఏ హుస్సేని, షబ్నం, సలీమ్‌లను మరణించే వరకు ఉరి తీయాలని తీర్పు ఇచ్చారు.

2008 ఏప్రిల్ 14 అర్థరాత్రి.. షబ్నమ్ కుటుంబసభ్యులందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు అంత త్వరగా మేల్కొనే అవకాశం లేదు. ఎందుకంటే అంతకు ముందు రోజు రాత్రి వారికి పాలలో మత్తు మందు కలిపి ఇచ్చింది. అందరూ గాఢ నిద్రలోకి వెళ్లిన తరువాత సలీంని ఇంటికి రప్పించింది. అతడితో కలిసి ఒక్కొక్కరిని గొడ్డలి తీసుకుని నరికేసింది. చిన్నవాడైన మేనల్లుడిని కూడా వదల్లేదు.

హత్య జరిగిన 5 రోజుల తర్వాత షబ్నమ్‌, సలీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. షబ్నం అప్పటికే ఏడు వారాల గర్భవతి అని వైద్యుల పరిక్షల్లో తేలింది. వారిద్దరపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 2008 డిసెంబర్‌లో షబ్నమ్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కేసు విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులిద్దరికీ మరణశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే దీన్ని సవాలు చేస్తూ నిందితులు ఇద్దరూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే అలహాబాద్ కోర్టు సమర్థించింది. రివ్యూ పిటిషన్ కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నం 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది.

చివరి ప్రయత్నంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి క్షమాభిక్ష కోరారు. కానీ ఆయన కూడా వారికి క్షమాభిక్ష పెట్టడానికి నిరాకరించారు. దీంతో దారులన్నీ మూసుకుపోయాయి. ఇక ఉరిశిక్ష అమలు పరచక తప్పని పరిస్థితి. దోషులిద్దరినీ ఉరి తీయడానికి మథుర కోర్టు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఉరి తేదీలను త్వరలోనే ఖరారు చేయనుంది. మీరట్‌‌కు చెందిన తలారి పవన్ జల్లద్ షబ్నమ్‌ను ఉరి తీయనున్నాడు. ఇతడే 2012లో ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన దోషులను ఉరి తీసిన తలారి.

షబ్నమ్‌ను ఉరి తీసేందుకు అవసరమైన తాడు కోసం అధికారులు ఆర్డర్ చేశారు. ఉరితీత తేదీ ఖరారు చేయడమే తరువాయి. అదే జరిగితే దేశంలో ఉరికంభం ఎక్కిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోనుంది షబ్నమ్. మహిళా ఖైదీలను ఉరితేసే ఏకక ప్రదేశం మథుర జైలు. దీన్ని 150 ఏళ్ల కిందట నిర్మించారు. దీనిని 1870లో బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడే స్వాతంత్ర్యానికి పూర్వం ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. స్వాతంత్ర్యం తరువాత ఉరికంబం ఎక్కనున్న తొలి మహిళగా షబ్నమ్ వార్తల్లోకి ఎక్కనుంది.

Tags

Read MoreRead Less
Next Story