New Zealand PM: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని..

వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునేది హోలీ పండగ. ఈరోజు (మార్చ్ 14) ప్రపంచవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్ సైతం ప్రజలతో కలిసి హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సహజ సిద్ధమైన రంగులతో హోలీ ఆడారు. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. వాణిజ్యం, పెట్టుబడుతో సహా కీలక అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపడానికి ఆయన మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు భారత్‌లో పర్యటించబోతున్నారు. తాను భారతదేశానికి బిగ్ ఫ్యాన్ ని అంటూ ఆయన పలుమార్లు తెలియజేశారు.
ఇక, దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయాన్నే కామదహన వేడుకలు నిర్వహించారు. మరోవైపు, హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో గల 60 అంతస్తుల SAS క్రౌన్‌లో హోలీ సంబరాలు ఆకాశాన్ని అంటాయి. స్కైబ్లాస్ట్ పేరుతో నిర్వహించిన రంగుల తుపాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. అలాగే, హోలీ పండుగ వేళ రూల్స్ అతిక్రమించొద్దని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com