Trump : టారిఫ్ డీల్ పై తొందరేం లేదు

Trump : టారిఫ్ డీల్ పై తొందరేం లేదు
X

టారిఫ్ విషయంలో ఇతర దేశాలతో డీల్ కుదుర్చుకునేందుకు తానేం తొందరపడ టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. వైట్ హౌస్ లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై ఒప్పందాలు నిర్దిష్ట సమయంలో జరుగుతాయి. వీటిపై మేం తొందరపడటం లేదు. ఎందుకంటే మా టారి ఫ్లతో ఇన్ కమ్ వస్తోంది. అయితే, ఈయూ, ఇతర దేశాలతో డీల్స్ చేసుకోవడం సులువే. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగానూ ఆవిడతో మంచి అనుబంధం ఉంది' అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. సుంకాల ప్రకటన తర్వాత ట్రంప్ తో ముఖాముఖి చర్చలు జరిపిన తొలి ఐరోపా నేత మెలోనీనే కావడం గమనార్హం. చైనాతో మంచి డీల్ చేసుకుంటాం వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. సుంకాల విషయంలో పోటాపోటీగా మరింత ముందుకువెళ్లాలని తాను భావించడం లేదన్నారు. 'నేను మరింత పైకి వెళ్లాలని భావించడం లేదు. ఎందుకంటే అలాచేస్తే ప్రజలు కొనలేని స్థాయికి చేరుకొంటారు' అని పేర్కొన్నారు. కాగా అమెరికా, చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై యూఎస్ ఏకంగా 245 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.

Tags

Next Story