ట్రంప్ వద్దు.. బైడెన్ బెటర్.. పుతిన్ సంచలన స్పందన

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ (Putin) అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లకు (Donald Trump) పోలిక పెట్టాడు. బైడెన్ రెండోసారి గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రష్యా తెలిపింది.
అమెరికాతో కలిసి పనిచేయడానికి రష్యా ఎప్పుడూ సిద్ధంగా ఉందని పుతిన్ తెలిపారు. బైడెన్ అనుభవజ్ఞుడనీ.. పరిస్థితులను అంచనా వేయగలడని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ వస్తేనే మేలని రష్యా అధ్యక్షుడు చెప్పారు.
బైడెన్ ఆరోగ్యంపైనా స్పందించారు వ్లాదిమిర్ పుతిన్. ఊహాగానాలపై స్పందించేందుకు నిరాకరించిన పుతిన్.. తాను డాక్టర్ ను కాదన్నారు. తాను బైడెన్‌ను 2021లో స్విట్జర్లాండ్‌లో కలిసినప్పుడు కూడా ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని… కానీ, అప్పటికి ఆయన నార్మల్ గానే ఉన్నారని చెప్పారు. అమెరికా విధానాలను బైడెన్ బలంగా చాటగలరని చెప్పారు. ప్రచారం ఊపందుకున్న టైంలో ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com