North Korea : అణు పరీక్షకు ఉత్తర కొరియా సన్నాహాలు

ఉత్తర కొరియా తన ఏడో అణు పరీక్షకు సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం అందిందని దక్షిణ కొరియా పేర్కొంది. ఈమేరకు తమ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చట్టసభ సభ్యులకు వివరాలు అందజేసినట్లుగా తెలిపింది. అమెరికాలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణిని పరీక్షించేందుకూ ఆ దేశం సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.ఉత్తర కొరియా ఈశాన్య పట్టణం పుంగ్గే-రిలోని టెస్టింగ్ గ్రౌండ్‌లో అణు పరీక్షను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసిందని.. టన్నెల్ నంబర్ 3 వద్ద పేలుడు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీ పేర్కొంది. అణు పరీక్ష నవంబర్‌లో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా రష్యాకు పంపిన వేలమంది సైనికులను రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో ఇప్పటికే మోహరించిందని..ఇదంతా చూస్తుంటే యుద్ధానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com